సంతానం లేని దంపతులు ఈ నియమాలను పాటిస్తే..!?

FILE
మాతృత్వం ఓ మధురానుభూతి. జీవితంలో ఓ వెలుగును నింపే సంతానం కలుగలేదని బాధపడుతున్నారా.. అయితే ఫెంగ్‌షుయ్ సూచనలు పాటించండి. సంతానం లేని దంపతులు ఫెంగ్‌షుయ్ చిట్కాలు పాటించడం ద్వారా పండంటి బిడ్డను కనవచ్చునని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.

ముందుగా దంపతులు శయనించే బెడ్‌కి సమీపంలో చిన్న పిల్లలున్న బొమ్మలను గాని, పెయింటింగ్ గానీ వేలాడదీయండి. అలాగే మీ భర్త భాఘువా నెంబర్‌ని కనుక్కొని, దాని ప్రకారం అతడికి కలిసొచ్చేలా మంచాన్ని జరపండి.

అలాగే మీ బెడ్‌రూమ్‌లో మీరు పడుకునే చోట పైన పైకప్పు మీద దూలం వుండకూడదు. మంచానికి ఎదురుగా టాయ్‌లెట్‌గాని, అద్దాలుగానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు గాని లేకుండా చర్యలు తీసుకోవాలి. అయితే దంపతులు ఒకే డబుల్ కాట్ మంచం మీద రెండు పరుపులు వేసుకుని శయనించరాదు. దంపతులు శయనించే పడకగదిలో ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచండి. బెడ్‌రూమ్‌లో మీరు నిద్రిస్తున్నప్పుడు రొమాంటిక్ మ్యూజిక్ వచ్చేలా ఏర్పాటు చేసుకోండి.

ముందుగా మీ దంపతులు శయనించే బెడ్‌కి ఎదురుగా ఏదైన గోడమూలలు పొడుచుకుని వచ్చాయోమోనని గమనించండి. అలాగే మీ ఇంటి ముఖద్వారాన్ని సైతం బయటి నుంచి ఏదైనా విషపు బాణాలు పొడుటుకునేటట్లు చేస్తున్నట్లు మొనలు ఉన్నాయేమో.. ఉదాహరణకు ఏదైనా చెట్టుకొమ్మ ముందుకు మీ ఇంటి గుమ్మం ఎదురుగా పొడుచుకుందేమో పరిశీలించండి. అలాంటి వాటిని నరికి వేయడం లేదా కవర్ చేయాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి