తెలివి ఎక్కువైతే ఏమవుతుంది..?

బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (14:25 IST)
తెలివికీ, శరీర ఆరోగ్యానికి సంబంధం ఉందంటున్నారు వైద్యులు. తెలివితేటలు ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో మానసిక రుగ్మతలు, ఒత్తిడి, ఆందోళన అనేవి ఎక్కువగా ఉంటాయని వారు చెప్తున్నారు. సాధారణ తెలివితేటలు కల వ్యక్తులతో పోలిస్తే ఎక్కువ తెలివితేటలు కల వ్యక్తుల్లో ఆరోగ్య సమస్యలు పది శాతం ఎక్కువగా ఉంటాయన్న విషయం ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడైంది.
 
సుమారు 500 మంది చిన్నారుల మీద వీరు సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేశారు. వీరి ఆరోగ్య పరిస్థితి, ఆలోచనా విధానం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో 200 మంది చిన్నారులు మామూలు కన్నా ఎక్కువ తెలివితేటలు కలిగిన వారు. మిగిలిన వారు సాధారణ తెలివితేటలు కలిగిన వారు. వీరిలో 10 శాతం మందికి 18 నుండి 20 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి వీరిలో ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలే కాకుండా కొన్ని మానసిక రుగ్మతలను కూడా అధ్యయనకారులు గుర్తించారు. సాధారణ తెలివితేటలు కలిగిన పిల్లల్లో పై సమస్యలను అధ్యయనకారులు గుర్తించలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు