శీతాకాలంలో కొద్దిగా మంచినీళ్లు తాగినా తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందా?

గురువారం, 20 జనవరి 2022 (14:54 IST)
శీతాకాలం సీజన్‌లో కొద్దిపాటి నీళ్లు తాగినప్పటికీ మళ్లీ మళ్లీ మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం చాలాసార్లు జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మంచినీళ్లు తాగడం తగ్గిస్తాం.


వింటర్ సీజన్‌లో ఐదు నుంచి ఆరుసార్లు టాయిలెట్‌కి వెళ్లడం సాధారణమైనప్పటికీ, తక్కువ నీరు తాగేవారు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ పదేపదే టాయిలెట్‌కు వెళతారు. మీ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంటే మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. అవేంటో చూద్దాం.

 
సాధారణంగా టాయిలెట్‌కి ఎంత తరచుగా వెళ్తారు? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మూత్రవిసర్జనకు తరచుగా వెళ్లే పరిస్థితి ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. కానీ ఇప్పటికీ ఆరోగ్యవంతమైన వ్యక్తి 24 గంటల్లో 4 నుండి 10 సార్లు వాష్‌రూమ్‌కు వెళ్లవచ్చు. టాయిలెట్‌కి వెళ్లే పరిమాణం వయస్సు, ఔషధం, మధుమేహం, మూత్రాశయం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి.

 
తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడానికి కారణాలు ఏమిటి? ఏదైనా వ్యాధి లేని వ్యక్తి మళ్లీ మళ్లీ వాష్‌రూమ్‌కు వెళ్లవలసి వస్తే, మూత్రాశయం మరింత చురుగ్గా ఉంటుంది. ఇలాంటివారు తరచుగా టాయిలెట్‌కు వెళతారు. ఇది కాకుండా, మూత్రాన్ని సేకరించడంలో మూత్రాశయం యొక్క సామర్థ్యం తగ్గడం ప్రారంభించినప్పుడు లేదా దానిపై ఒత్తిడి ఉన్నప్పుడు, ఈ సమస్య కూడా వస్తుంది. అటువంటి పరిస్థితిలో కొద్దిగా నీరు త్రాగిన తర్వాత మూత్రవిసర్జనను ఆపడం కష్టం అవుతుంది.

 
శరీరంలో చక్కెర పెరుగుదల... మధుమేహ వ్యాధిగ్రస్తులు మరుగుదొడ్లకు పదేపదే వెళుతుంటారు. టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతారు. రక్తంలో చక్కెర పరిమాణం పెరిగినప్పుడు ఈ సమస్యతో ఇబ్బంది పడతారు. మూత్రవిసర్జన సమయంలో మంట అనిపిస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కలిగి ఉండటం... అకస్మాత్తుగా తరచుగా మూత్రవిసర్జనకు గురవుతుంటే, తేలికపాటి జ్వరం, వికారంతో బాధపడుతుంటే, అది మూత్రనాళాల ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. మహిళల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో, తరచుగా టాయిలెట్ వెళ్లడంతో పాటు, మంట, తేలికపాటి నొప్పి కూడా అనిపిస్తుంది.
 
 
కిడ్నీ ఇన్ఫెక్షన్.... నీళ్లు తక్కువగా తాగితే కిడ్నీపై చెడు ప్రభావం పడుతుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినా మళ్లీమళ్లీ టాయిలెట్ వస్తూనే ఉంటుంది. తరచుగా మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా అనిపిస్తే, వెంటనే కిడ్నీని పరీక్షించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు