Jagapathi Babu: ఊర్మిళ అంటే నాకు ఇష్టం.. జగపతిబాబుతో చెప్పించిన రామ్ గోపాల్ వర్మ

సెల్వి

సోమవారం, 8 సెప్టెంబరు 2025 (10:38 IST)
Jagapathi Babu
చిత్ర నిర్మాత రామ్ గోపాల్ వర్మ జగపతి బాబుతో కలిసి జయమ్ము నిశ్చయమ్మురా అనే చాట్ షోకి గెస్ట్‌గా వచ్చినప్పుడు కొన్ని సీక్రెట్లు షేర్ చేసుకున్నారు. వారు 1993 పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ గాయంలో కలిసి పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఇందులో జగపతి ఊర్మిళ మటోండ్కర్ సరసన ప్రధాన పాత్ర పోషించారు. 
 
ఈ సినిమా గురించి జగపతి బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా టైమ్‌లో వర్మ తనకు ఊర్మిళకు మధ్య విభేదాలు సృష్టించాడు. ఊర్మిళతో ఎందుకు కలిసివుండవని తనను అడిగారు. వర్మతో అలాంటిది ఏమీ లేదు. ఆమెతో తాను కలిసేవుంటానని.. ఆమెను ద్వేషించడం లేదు.. అందుకని ఆమె అంటే ఇష్టమూ లేదని చెప్పానని అన్నారు. ఈ విషయాన్ని వర్మ వేరేలా తీసుకెళ్లి ఊర్మిళతో చిచ్చు పెట్టారు. 
 
ఊర్మిళ దగ్గరకు తీసుకెళ్లి జగపతి బాబు ఆమెను ద్వేషిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య వర్మ బాగానే చిచ్చు పెట్టారని జగపతి బాబు తెలిపారు. ఆయన ఎందుకు అలా చేశారో తెలియదు. చివరికి తనకు ఊర్మిళ అంటే ఇష్టం అనే చెప్పేంతవరకు వదిలిపెట్టలేదు. అలా చెప్పే వరకు తాను షూట్ చేయనని తెలిపారు. చివరికి రాము "నాకు ఊర్మిళ అంటే ఇష్టం" అని చెప్పేశాను. వర్మ చాలా కూల్‌గా వుంటాడు. అన్ని షాట్‌లను సూపర్ ఫాస్ట్‌గా పూర్తి చేస్తాడని జగపతి ఎత్తి చూపారు.
 
చాలామంది స్టార్ హీరోలు ఫామ్‌లో వుండగా చిత్ర నిర్మాతపై ఒత్తిడి ఉన్నప్పటికీ, గాయంలో తనను ఎంపిక చేసుకున్నందుకు వర్మకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగపతిబాబు అన్నారు.

జగపతి అంతకు ముందు కొన్ని పరాజయాలు ఎదుర్కొన్నందున, గాయం తనను ఒక సూపర్ హీరోగా మార్చిందని పేర్కొన్నారు. గాయం సినిమాలో తన పాత్రకు తొలిసారిగా తన సొంత గొంతును ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు జగపతి బాబు రామ్ గోపాల్ వర్మకు థ్యాంక్స్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు