పని ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. స్నాక్స్‌గా ఏం తీసుకోవాలో తెలుసా?

గురువారం, 19 జులై 2018 (12:34 IST)
పని ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. స్నాక్స్‌గా ఏం తీసుకోవాలంటే.. బొప్పాయి ముక్కలను ఓ డబ్బాలో ఇంటి నుంచి కట్ చేసుకుని ఆఫీసుకు తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బొప్పాయి ముక్కలగా స్నాక్స్‌గా తీసుకోవాలి. బజ్జీలు వంటివి తీసుకోకుండా స్నాక్స్ సమయంలో బొప్పాయి ముక్కలను తీసుకోవాలి. అలాగే బొప్పాయిలో ఫైటో న్యూట్రియంట్స్‌, ఫ్లవనాయిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల డిఎన్‌ఎని పరిరక్షిస్తాయి. కాన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి. 
 
బొప్పాయిలో విటమిన్‌ సి, విటమిన్‌, బీటా కెరొటిన్‌ వంటి యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా, చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా కాపాడతాయి. నెలసరి సమయంలో నొప్పితో బాధపడే మహిళలకు బొప్పాయి పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది. నెలసరి సమయంలో రక్తస్రావం సరిగా అయ్యేట్టు చేస్తుంది.
 
ఆర్థరైటిస్‌తో బాధపడేవాళ్లకి కూడా బొప్పాయి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. యాంటి ఇన్‌ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది. మధుమేహ వ్యాధితో బాధపడేవాళ్లు కూడా ఈ పండును నిస్సంకోచంగా తినొచ్చు. డయాబెటిస్‌ వచ్చే అవకాశమున్న వారు ఈ పండును తింటే డయాబెటిస్‌ నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా బరువు తగ్గాలనుకునేవారు రోజూ రెండు కప్పుల బొప్పాయి పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు