ఎవరైనా కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు మటుమాయమౌతాయి. ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగ పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది. జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నిత్యం లవంగాలను తీసుకోవాలనుకునేవారు కేవలం ఐదు లవంగాలను మాత్రమే సేవించాలి. అంతకు మించి వాడితే శరీరం వేడి చేస్తుంది.