పచ్చని అరటి పండుతో మధుమేహం మటాష్ (Video)

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (15:10 IST)
పచ్చని రంగులోని అరటి పండును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పచ్చని అరటి పండ్లను తీసుకోవడం ద్వారా పేగుల్లోని రుగ్మతలను తొలగిస్తుంది. అల్సర్‌ను మాయం చేస్తుంది. అల్సర్ వున్న వారు పచ్చ అరటి పండ్లను రోజూ తీసుకోవడం మరిచిపోకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్థులకు పచ్చ అరటిపండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయి. 
 
పచ్చని అరటిలోని పోషకాలు రక్తంలోని చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది. హృద్రోగ వ్యాధులను దూరం చేసుకోవాలంటే.. పచ్చని అరటి పండ్లను తీసుకోవాలి. ఇందులోని పొటాషియం గుండె సంబంధిత రుగ్మతలను దరిచేరనివ్వదు. బరువు తగ్గాలనుకునే వారు పచ్చ అరటి పండ్లను తీసుకోవాలి. పచ్చని అరటి పండ్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా గుండెకు వెళ్లే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. 
 
దంత సమస్యలను తొలగించుకోవాలంటే.. పచ్చ అరటి పండ్లు దంత సమస్యలను, చిగుళ్ల వాపుకు చెక్ పెడుతుంది. ఇందులోని క్యాల్షియం దంతాలను ధృఢంగా వుంచుతాయి. ఇంకా వ్యాయామం తర్వాత పచ్చ అరటిపండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు