మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలలో అధిక పోషక విలువలు వుంటాయి. ఎందుకంటే మల్టీగ్రెయిన్ వివిధ ధాన్యాల కలయిక వల్ల పోషక శక్తిని అందిస్తుంది. మధుమేహాన్ని అదుపులో వుంచుతుంది. ఇంకా ఏమేమి ప్రయోజనాలు వున్నాయో తెలుసుకుందాము. మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రోటీలను తింటుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇవి తింటుంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా పెరుగుతాయి.