చూయింగ్ గమ్ తరచుగా నమలడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? (Video)

మంగళవారం, 25 జులై 2023 (20:20 IST)
చాలా మందికి రోజూ చూయింగ్ గమ్ నమలడం అలవాటు. దీన్ని నమలడం కొన్ని సందర్భాల్లో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, నిరంతర నమలడం కూడా హాని కలిగిస్తుందని పలుసార్లు రుజువైంది. చూయింగ్ గమ్ వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసుకుందాము. రకరకాల రంగులు, రుచుల్లో లభించే చూయింగ్ గమ్ కొని నమలడం చాలా మందికి అలవాటు.
 
చూయింగ్ గమ్ నోటి దుర్వాసనను పోగొట్టడానికి, లాలాజల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఐతే చూయింగ్ గమ్‌ని నిరంతరం నమలడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తరచుగా నమలడం వల్ల దవడ ఎముకలు త్వరగా అరిగిపోయే ప్రమాదం వుంది.
 
ఎక్కువగా చూయింగ్ గమ్ తిన్నప్పుడు, దానిలోని చక్కెర చిగుళ్ళలోని బ్యాక్టీరియాను ప్రేరేపిస్తుంది, ఇది దంతక్షయాన్ని కలిగిస్తుంది. చాలామందికి పొరబాటున చూయింగ్ గమ్ మింగేస్తారు. కొన్నిసార్లు దానిని తొలగించడానికి శస్త్రచికిత్స చేసిన సందర్భాలు ఉన్నాయి. చూయింగ్ గమ్ ఎక్కువగా నమిలితే బుగ్గల్లోని 'కండరం' పెద్దదై ముఖం చతురస్రాకారంలో కనిపిస్తుంది.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు