ప్రతి రోజు ఆపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే ఉండదని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందుకే నిత్యం ఒక ఆపిల్ పండును ఖచ్చితంగా తినాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నిజానికి ఆపిల్ మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది. దాని ద్వారా మనకు అనేక పోషకాలు కూడా అందుతాయి. అయితే చాలా మందికి రోజులో ఏ సమయంలో ఆపిల్‌ను తినాలనే విషయంపై సందేహ పడుతుంటారు. అసలు ఆపిల్‌ను ఏ సమయంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్‌ను పగటిపూట తినడం చాలా ఉత్తమమని నిపుణులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం ఆపిల్‌లో ఉండే పెక్టిన్, పీచు పదార్థాలే. ఆపిల్‌ను ఉదయం లేదా రాత్రి తింటే అందులో ఉండే పెక్టిన్, పీచు పదార్థాల వల్ల ఆపిల్ త్వరగా జీర్ణం కాదు.