వేసవిలో ఆహార పదార్థాలు త్వరగా పాడయిపోతాయి. మాంసాహారం, చేపలతో వండుకున్నవి పాడయినట్లు మనకు అంత తేలిగ్గా తెలియదు. దాంతో కొన్నిసార్లు అవి పాడయినా తెలియక తినేసి సమస్యలు తెచ్చుకుంటాం. పాడైపోయిన పదార్థాలను ఇట్టే పట్టేసి ఓ పరికరం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీని పేరు ఎలక్ట్రానిక్ నోస్.