స్టీమింగ్ మెషిన్‌లో తులసి ఆకులు వేసి ఆవిరిపడితే..... (video)

బుధవారం, 31 జులై 2019 (21:52 IST)
కొంతమంది జలుబు, జ్వరం, తలనొప్పి వచ్చినప్పుడు మందులు వేసుకోరు. ఎందుకంటే.... కొంతమందికి మందులు వేసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. తలతిరగడం, వాంతులు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటివారు సహజసిద్ధంగా లభించే తులసితో జలుబు, జ్వరం సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
 
1. జలుబు, జ్వరంతో బాధపడేవారు నాలుగు తులసి ఆకులను నమలాలి. లేదంటే గ్లాసు నీళ్లల్లో తులసి ఆకులను వేసి బాగా మరిగించాలి. అవి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే శరీరంలోని ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. జ్వరము తగ్గుముఖం పడుతుంది.
 
2. దగ్గుతో బాధపడుతున్నప్పుడు గ్లాసు నీళ్లల్లో లవంగాలు, తులసి ఆకులను వేసి బాగా మరిగించి ఆ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
 
3. తులసి ఆకులను తీసుకోవడం వలన రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఈ ఆకులలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలానే వీటిల్లో ఉండే యాంటీఆక్సీడెంట్లు గుండెకు మేలు చేస్తాయి.
 
4. తలనొప్పిగా ఉన్నప్పుడు స్టీమింగ్ మెషిన్‌లో తులసి ఆకులు వేసి ఆవిరిపడితే తల భాగంలోని నరాలు ఉత్తేజితమవుతాయి. తద్వారా తలనొప్పి తగ్గుతుంది.
 
5. మధుమేహం ఉన్నవారు డికాక్షన్లో తులసి ఆకులను వేసుకుని తాగితే రక్తంలోని చక్కెర శాతం అదుపులోకి వస్తుంది.
 
6. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తులసి ఆకులను తింటే మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి. తులసి ఆకుల్లోని యాంటీఆక్సీడెంట్లు శరీరంలోకి విడుదలై రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఒత్తిడిగా ఉన్నప్పుడు ఇవి తింటే శరీరంలో మేలు చేసే హార్మోన్లు విడుదలవుతాయి. తరచూ ఆందోళనా, ఒత్తిడికి గురి అవుతుంటే పది పన్నెండు ఆకులను నమలాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు