3. ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు స్త్రీలకు ఎక్కువగా మేలు చేస్తుంది. మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.
4. బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం తగ్గే అవకాశం ఉంది.
5. అజీర్తి, పుల్లత్రేపులు, కడుపు ఉబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి తగు ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది.