ఆకుపచ్చని కూరగాయలతో జ్ఞాపకశక్తి పెరుగుతుందా...?

మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (10:28 IST)
ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని క్రమంగా ఆహారంలో చేర్చుకోవడం వలన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఆకుపచ్చని ఆహార పదార్థాల్లో న్యూట్రియన్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. నేత్ర సమస్యలతో బాధపడేవారికి ఆకుపచ్చని పండ్లు, కూరగాయలు చాలా ఉపయోగపడుతాయి.
 
ముఖ్యంగా ఆకుపచ్చని పండ్లలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటినాయిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. అంతేకాకుండా హైబీపీ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. శరీర రోగనిరోధన శక్తిని పెంచుటకు ఆకుపచ్చని పదార్థాలు చక్కగా పనిచేస్తాయి.
 
ఆకుపచ్చని ఆహారాలను తరచుగా తీసుకోవడం వలన అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పచ్చని పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఆకుపచ్చని ఆహార పదార్థాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఈ ఆకుపచ్చని పదార్థాలను తీసుకోవడం వలన శరీరానికి సంపూర్ణ పోషణ లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు