కమలా పండులో విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలేట్, నియాసిన్, పాంటోథెనిక్ యాసిడి, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కమలా పండులోని మెగ్నిషియం రక్తహీనతను అదుపులో ఉంచుతుంది. ఈ కాలంలో ఈ పండు దొరుకుతుంది. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. గుండె పట్టేయడం వంటి సమస్యలను తొలగిస్తుంది. ఈ కమలాపండును జ్యూస్ రూపంలో తీసుకుంటే గర్భిణులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. చర్మసౌందర్యానికి కూడా సహాయపడుతుంది.