ఉల్లికాడల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఉల్లికాడల్లో కెరొటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచుటలో చక్కగా పనిచేస్తాయి. జలుబు వలన తలెత్తే సమస్యలను తగ్గించుటలో ఉల్లికాడలు చాలా ఉపయోపడుతాయి. గుండె ఆరోగ్యానికి ఉల్లికాడలు ఎంతో మంచివి. ఉల్లికాడల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ డిఎన్‌ఎ, సెల్యులర్ టిష్యూలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
ఉల్లికాడల్లోని విటమిన్ సి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా రక్తపోటు సమస్యలను నుండి విముక్తి చెందవచ్చును. ఇందులో వుండే విటమిన్ కె ఎముకల ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. ఈ ఉల్లికాడల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాల వలన శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తంలోని బ్లడ్‌షుగర్ ప్రమాణాలను తగ్గించుటలో ఉల్లికాడలు మంచిగా ఉపయోగపడుతాయి.