మధుమేహం వ్యాధి భారినపడితే జీవితాంతం పాటూ మందులు వాడాల్సిందే. కానీ ఇక్కడ తెలిపిన చిట్కాలను పాటించటం వలన వ్యాధి తీవ్రతలను తగ్గించవచ్చు. రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లయితే, మొదటగా తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. మంచి పోషకాహార నిపుణుడిని కలిసి ఆహార ప్రణాళికను రూపొందించుకోవాలి. నాణ్యమైన మరియు పరిమిత మోతాదులో తినటం వలన అనుకూల ఫలితాలను పొందుతారు. అదనంగా, కార్బోహైడ్రేట్లను తగ్గించి వీటికి బదులుగా ప్రోటీన్లను తీసుకుంటే చాలా మంచిది.
4. మాత్రలు శరీర రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు రోజువారి ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా టైప్-1 మధుమేహాన్ని శక్తివంతంగా తగ్గుతుంది. కొన్ని సార్లు టైప్-2 మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుటకు ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరం అవుతుంది. క్రమంగా వైద్యుడిని కలిసి రక్తలోని గ్లూకోస్ స్థాయిలను చెక్ చేయించుకోవటంతో పాటు, బ్లడ్ గ్లూకోస్ మీటర్‌తో తరచూ స్వతహాగా ఇంట్లో కూడా చెక్ చేస్తూ ఉండటం మంచిది. ఇలా క్రమంగా చెక్ చేస్తూ ఉండటం వలన రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గినా లేదా పెరిగిన వాటినికి అనుగుణంగా వైద్యం అందించవచ్చు.