రాత్రిపూట గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగితే మంచిదేనా అనే సందేహం వుంటుంది. ఈ నిమ్మరసాన్ని తాగితే పడుకునే ముందు విశ్రాంతిని కలిగించి చక్కటి నిద్రకు సహాయపడుతుంది. ఇది సాధారణ ఆర్ద్రీకరణకు కూడా సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది కనుక శారీరక విధులను సక్రమంగా నిర్వహించేట్లు చేస్తుంది.