ఎండు నల్ల ద్రాక్షలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే పరగడపున తింటే?

బుధవారం, 24 మే 2023 (18:32 IST)
ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి.
 
తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది. నల్ల ఎండు ద్రాక్షలో క్యాల్షియం వుంటుంది, అందువల్ల అవి తింటే ఎముకలు దృఢంగా పెళుసుబారకుండా వుంటాయి. నల్ల ఎండు ద్రాక్ష కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
నల్ల ఎండు ద్రాక్ష తింటే మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఛాతీలో మంట, అజీర్ణం తగ్గాలంటే నల్ల ఎండుద్రాక్షను తింటుండాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు