చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతుంటారు. దీనికి పచ్చి బఠాణీలతో చెక్ పెట్టొచ్చు. సాధారణంగా వీటిని అనేక రకాల కూరల్లో వేస్తుంటాం. కుర్మా, బిర్యానీ వంటివాటిల్లో ఎక్కువగా వాడుతుంటాం. ఇవి వేయడం వల్ల కూరకు చక్కని రుచి వస్తుంది. అలాగే, ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటాయి. వీటిని మనం తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో శరీరానికి చక్కని పోషణ అందుతుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఈ క్రమంలోనే పచ్చి బఠానీలను తరచూ తీసుకుంటే వాటితో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి1, బి2, సిలతోపాటు ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి బఠానీలను ఉడికించి ముద్దలా చేసి ఎదుగుతున్న పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి ఇస్తే బలవర్దక ఆహారాన్ని అందించిన వారమవుతాం.