కుంకుమపువ్వుతో రుచికరమైన "అమ్రిత్‌సరీ నాన్"

FILE
కావలసిన పదార్థాలు :
మైదా.. నాలుగు కప్పులు
డ్రై ఈస్ట్.. 4 టీ.
పంచదార.. 2 టీ.
వెన్న.. 6 టీ.
వేడిపాలు.. ఒక కప్పు
పెరుగు.. 4 టీ.
కుంకుమపువ్వు రేకలు... ఒక టీ.

తయారీ విధానం :
కాసిన్ని గోరువెచ్చటి పాలల్లో కుంకుమపువ్వు రేకల్ని వేసి నానబెట్టి ఉంచాలి. మిగిలిన పాలల్లో ఈస్ట్, పంచదార కలిపి ఆ పాత్రను కదపకుండా అలాగే ఉంచాలి. ప్లేటు తీసుకుని అందులో మైదా, తగినంత ఉప్పు, ముందుగా చేసిన ఈస్ట్ మిశ్రమం, కుంకుమపువ్వు రేకలు, పెరుగు వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమానికి తడిగుడ్డ కప్పి ఒక రాత్రంతా నానబెట్టాలి.

మరుసటి రోజు ఉదయాన్నే కాస్తంత పిండి తీసుకుని చేత్తోనే చపాతీలాగా ఒత్తాలి. దాన్ని నూనె రాసిన బేకింగ్ ట్రేపై ఉంచి ఇంకాస్త పెద్దగా చేసుకోవాలి. మొత్తం పిండినంతా అలాగే చేసుకుని 350 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాలుగైదు నిమిషాలపాటు మైక్రోవేవ్ ఓవెన్‌లో బేక్ చేస్తే సరిపోతుంది. అంతే రుచికరమైన అమ్రిత్‌సరీ నాన్ రోటీలు సిద్ధమైనట్లే..! రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే ఈ రోటీలను మీరూ ఓసారి ట్రై చేసి చూడండి మరి..!

వెబ్దునియా పై చదవండి