కాయలతో కమ్మగా కొట్టుకున్నారు... రసంలో తేలియాడారు..

మంగళవారం, 5 మార్చి 2019 (17:05 IST)
మనదేశంలో సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అగ్నిగుండ ప్రవేశం చేయడం, కర్రలతో దాడులకు పాల్పడటంతో పాటు రాళ్లతో పరస్పరం దాడులకు దిగడం వంటివి సాంప్రదాయంగా ఆచారాలలో భాగంగా చేస్తున్నారు. అయితే వీటన్నింటికీ భిన్నంగా కొన్ని దేశాల్లో టమోటాలతో, కోడిగుడ్లతో ఫైట్ చేస్తుంటారు. 
 
ఇటలీలో మాత్రం ఆరెంజ్‌లతో ఒకరిపై ఒకరు దాడులు చేస్తారు. వినడానికే విచిత్రంగా ఉన్నా, ఇది నిజమండీ. దీనినే బ్యాటిల్ ఆఫ్ ఆరెంజెస్ అని పిలుస్తుంటారు. ఇది సాధారణంగా ఫిబ్రవరి మాసంలో జరుగుతుంటుంది, అప్పుడప్పుడు మాత్రం మార్చి నెలలో వస్తుంటుంది. సిసిలీ నగరం నుండి దాదాపు 500 టన్నుల ఆరెంజ్‌లను దిగుమతి చేసుకుంటారు. 
 
12వ శతాబ్దంలో ఇవ్రియాని పాలిస్తున్న రాజు నిరంకుశత్వానికి చరమగీతం పాడినందుకు గుర్తుగా ప్రజలు దీనిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం మార్చి 2వ తేదీన ప్రారంభమైన ఈ బ్యాటిల్ ఆఫ్ ఆరెంజెస్ మూడు రోజుల పాటు అందరినీ అలరించి నేటితో ముగింపు దశకు చేరుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు