తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మలయాళ సంగీత దర్శకుడు బాలభాస్కర్ కుటుంబం త్రిస్సూర్‌లో ఓ దేవాలయ దర్శనం కోసం వెళ్లింది. అక్కడ దర్శనం, ఇతర పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత తిరిగి ఇంటికి బయలుదేరింది.
ఈ క్రమంలో డ్రైవర్ నిద్రమత్తులో కారును చెట్టుకు ఢీకొట్టడంతో ఘోరప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సింగర్ కుమార్తె తేజస్వి అక్కడికక్కడే చనిపోయింది. బాలభాస్కర్, ఆయన భార్య లక్ష్మి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మలయాళ చిత్ర పరిశ్రమలోకి 12 ఏళ్ళ వయస్సులో సంగీత దర్శకుడిగా బాలభాస్కర్ పరిచయమయ్యారు. అతి పిన్న వయసులో సినీ కెరియర్‌ను ప్రారంభించిన బాల స్టేజీ షోలతో సింగర్‌గా, వయోలినిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకన్నాడు.