కానీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, కార్గో విమానాలన్నింటిని 15 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు సిచువాన్ ఎయిర్ లైన్స్‌లో భాగమైన సిచువాన్ చువాన్‌హాంగ్ లాజిస్టిక్స్ లేఖ రాసింది. సేల్స్ ఏంజెట్లకు రాసిన లేఖలో చైనా నుంచి ఢిల్లీకి వచ్చే ఆరు రవాణా మార్గాల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.
భారత్‌లో కరోనా పరిస్థితులను క్యాష్ చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. భారత్‌కు పంపే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల, ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ ధరల్ని 35 నుంచి 40 శాతం పెంచనున్నట్టు తెలుస్తోంది. సరుకు రవాణా ఛార్జీలను 20 శాతానికి పెంచినట్లు షాంఘైకి చెందిన సినో గ్లోబల్ లాజిస్టిక్స్ సంస్థ ప్రతినిధి సిద్ధార్థ్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.