సుమారు 8 సంవత్సరాల పాటు పోప్ పదవిలో కొనసాగిన బెనెడిక్ట్ XVI కన్నుమూశారు. అనారోగ్య కారణాలను చూపుతూ 2013లో రాజీనామా చేశారు. తద్వారా 1415లో గ్రెగొరీ XII తర్వాత పదవీ విరమణ చేసిన మొదటి పోప్ అయ్యాడు. బెనెడిక్ట్ XVI తన జీవితపు చివరి సంవత్సరాలను వాటికన్‌లోని మాథర్ ఎక్లేసియా ఆశ్రమంలో గడిపారు. ఆయన వారసుడు, పోప్ ఫ్రాన్సిస్ ఆయనను కలిసేవారు.