దేశ ప్రథమ మహిళ, మొయిస్ సతీమణి మార్టిన్ మొయిస్‌కూ తీవ్రగాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతున్నదని వివరించారు. ఇది అనాగరిక, విద్వేషపూరిత చర్యగా ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం పరిస్థితులు పోలీసుల అదుపులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం కొనసాగడానికి, శాంతి భద్రతలు కాపాడటానికి నిర్విరామ ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. హైతీ దేశంలో రాజకీయ, ఆర్థిక పరిస్థితులు తీవ్రంగా దిగజారాయి. పేదరికం, రాజకీయ విభేదాలతో దేశం రెండుగా చీలింది. రాజకీయ ప్రేరేపిత హత్యలు పెచ్చరిల్లాయి. హంతకముఠాలు వీధుల్లో చక్కర్లు కొడుతున్నాయి.