శర్రాన్ సుదేర్లాండ్ అనే మహిళ గర్భంలో పెరుగుతున్న పిండం 14 వారాలకే చనిపోయింది. గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో వైద్యులు ఈ విషయాన్ని ధృవీకరించి పిండాన్ని తొలగించాలని చెప్పారు. పిండాన్ని తొలగించేటప్పుడు ముక్కలవుతుందన్నారు. అయితే పిండాన్ని ముక్కలు చేయొద్దని, తనకు అప్పగించాలని కోరడంతో వైద్యులు సర్జరీతో వెలికి తీసి ఆమెకు అందించగా, తన ఇంటికి తీసుకెళ్లింది.
14 వారాలకే ఆ పిండానికి పూర్తిగా అవయవాలు తయారవగా 26 గ్రాముల బరువు, 4 ఇంచుల పొడవు ఉంది. పిండాన్ని అలాగే ఎక్కువ రోజులు నిల్వ చేసేందుకు సెలైన్ సీసాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టింది. వారం రోజులు అలాగే గడిచిన తర్వాత చివరికి పూడ్చిపెట్టక తప్పలేదు.
వైద్యులు నా బిడ్డను పిండం, మెడికల్ వేస్ట్ అని పిలవడం నాకు ఏ మాత్రం నచ్చలేదు, కోపం వచ్చింది. అందుకే నా బిడ్డను నాకు అప్పగించాలని కోరాను. ఆ తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక హాస్పిటల్ నుంచి తెచ్చిన సెలైన్ సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాను. ఈ లోకం నా గురించి ఏమనుకున్నా ఫర్వాలేదు, కానీ నేను నా బిడ్డను పూడ్చకూడదని భావించాను.
కానీ వారం తర్వాత, పిండం పాడవుతుందని చెప్పడంతో, వేరే దారి లేక ఆ ప్రాణానికి ఊపరి పోయడం కోసం పూల కుండీలో పూడ్చిపెట్టాను. ఇక నా బిడ్డ ఆ మొక్క రూపంలో పెరుగుతాడు’’ అంటూ భావోద్వేగానికి గురైంది.