ఇర్మా తుఫాను.. గంటకు 192 కిమీ వేగంతో గాలులు.. ఎటు చూసినా నీరే...

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (10:09 IST)
కరేబియన్ దీవులను అతలాకుతలం చేసిన ఇర్మా తుఫాను ఫ్లోరిడాలో తీరందాటింది. ఫ్లోరిడా పశ్చిమ తీరంలోని మార్కో ద్వీపంలో ఇర్మా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గంటకు 192 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మరికొద్దిసేపట్లో తంపా సెయింగట్‌ పీటర్స్‌బర్గ్‌ను తాకే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
 
ఇర్మా తుఫాను తీరాన్ని దాటినప్పటికీ.. మరో 24 గంటల పాటు దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు... ఇర్మా భయంతో ఇప్పటికే ఫ్లోరిడాలో దాదాపు 63 లక్షల మందిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఈ హరికేను మార్కో ద్వీపం నుంచి తంపావైపునకు చురుగ్గా కదులుతోంది. తంపాలో 30 లక్షల మంది నివసిస్తున్నారు. ఫ్లోరిడా నగర వ్యాప్తంగా ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తున్నాయి. 
 
కాగా.. ఇర్మా స్థాయి తగ్గుతున్నట్లు కన్పిస్తోందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తీరం వద్ద 15 అడుగుల ఎత్తుతో అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో నాప్లెస్‌, మార్కో ద్వీపాల్లోని ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
 
ఇర్మా ధాటికి కరేబియన్‌ తీరంలో ఇప్పటికే 25 మంది ప్రాణాలు కోల్పోగా.. ఫ్లోరిడాలో ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫ్లోరిడా మొత్తం హరికేన్‌ పరిధిలో ఉందని ట్రంప్‌ అన్నారు. 

 

Absolute devastation in the US Virgin Islands after #Irma. Forests wiped out as far as the eye can see pic.twitter.com/z8a30nbRMM

— Brian L Kahn (@blkahn) September 10, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు