వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

ఠాగూర్

శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (09:56 IST)
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశ వలస విధానాన్ని మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలు వలదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ప్రధానంగా హెచ్1బీ వీసాదారులు స్వదేశానికి వెళ్తే తిరిగి అమెరికాలో కాలు పెట్టడం అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో తమ వద్ద పని చేసే టెక్కీలకు టెక్ కంపెనీలు హెచ్చరికలు జారీచేస్తున్నాయి. 
 
ఈ తరహా హెచ్చరికలు జారీచేసిన కంపెనీల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. తమ కంపెనీల్లో పని చేస్తున్న హెచ్1బి వీసాదారులు అప్రమత్తం చేస్తున్నాయి. అమెరికాను వీడొద్దని, వెళ్తే తిరిగి రావడం అంత సులువుకాదని టెక్కీలకు హెచ్చరిస్తున్నాయి. 
 
దీంతో తమతమ దేశాలకు వెళ్లేందుకు సిద్ధమైన అనేక మంది టెక్కీలు (హెచ్1బీ వీసాదారులు) తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం పేర్కొంది. అమెరికా పౌరులు మినహా మిగతా వారందరూ అక్రమ వలసదారులే అన్న భావన ప్రస్తుతం అమెరికాలో నెలకొందని భారతీయ వలసదారులు చెబుతున్నారంటూ ఆ కథనంలో పేర్కొంది. దీంతో తాము ఎక్కడికి వెళ్లినా అవసరమైన పత్రాలన్నీ తమ వెంట తీసుకుని వెళ్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటికే భారత ఎంబసీ అధికారులు కూడా ఎన్నారైలను అప్రమత్తం చేశాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు