ఇండోనేషియా బాండా సముద్రతీరంలో భారీ భూకంపం... వణికిపోతున్న ప్రజలు

గురువారం, 9 నవంబరు 2023 (08:44 IST)
ఇండోనేషియా దేశంలోని బాండా సముద్ర తీరంలో భారీ భూకంపం సంభవించింది. ఇది భూకంపలేఖినిపై 6.7గా నమోదైంది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. అయితే, ఈ భూకంప ప్రభావం కారణంగా సునామీ వచ్చే అవకాశాలు లేవని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. ఇండోనేషియా ప్రజలు వరుస భూకంపాల భయంతో వణికిపోతున్నారు.
 
తాజాగా అంటే బుధవారం రాత్రి 8.02 గంటల సమయంలో 6.7 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపాన్ని యూఎస్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ప్రభావం కారణంగా సునామీ వచ్చే అవకాశం లేదని స్పష్టంచేసింది. మరోవైపు, మంగళవారం ఉదయం 11.5. గంటల సమయంలో కూడా తనింబార్ దీవుల్లోని సౌమ్లాకి పట్ణంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, దీని కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. 
 
కాగా, భూకంప భయాలు ఇండోనేషియాన వెంటాడుతుంటాయి. ఈ దేశం ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతం జపాన్ నుంచి ఆగ్నేయాసియా, ఫసిఫిక్ బేసిన్ మీదుగా చాలా వరకు విస్తరించి ఉంటుంది. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతం భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు అధికంగా ఉంటాయి. ఈ కారణంగానే ఇండోనేషియాలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. మరోవైపు, సముద్రంలోని అగ్నిపర్వతాలు పేలుతుంటాయ. వీటి ప్రభావం కారణంగా కూడా పలు దేశాల్లో భాపంకాలు అధికంగా నమోదవుతున్నాయి. వీటి తీవ్రత అధికంగా ఉంటుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు