క్యాన్సర్ బారిన పడిన కింగ్ చార్లెస్‌.. అది మాత్రం తెలియరాలేదు..

సెల్వి

మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (10:22 IST)
కింగ్ చార్లెస్‌కు ఒక రకమైన క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. అయితే క్యాన్సర్ రకాన్ని పేర్కొనలేదు. క్యాన్సర్ కోసం సోమవారం 'రెగ్యులర్ ట్రీట్‌మెంట్స్' ప్రారంభించాడని, చికిత్స సమయంలో పబ్లిక్ డ్యూటీలను వాయిదా వేస్తారని ప్యాలెస్ తెలిపింది. 
 
"రాజు తన చికిత్స గురించి పూర్తిగా సానుకూలంగా ఉన్నారు. వీలైనంత త్వరగా పూర్తిగా కోలుకుని ప్రజా సేవ కోసం తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారు" అని ప్యాలెస్ తెలిపింది.
 
తన రోగ నిర్ధారణ గురించి తన కుమారులిద్దరికీ వ్యక్తిగతంగా తెలియజేశారు. క్యాన్సర్ దశ, ఏ రకమైన క్యాన్సర్, చికిత్స గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి వున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు