టెక్సాస్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో 40 లక్షల మందికిపైగా నీళ్లు, కరెంట్ లేక అల్లాడిపోతున్నారు. టెక్సాస్‌లో పైపుల్లో నీరు గడ్డ కట్టుకపోవడంతో ప్రజలు నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ ప్లాంట్లు సరిగా పని చేయడం లేదు. దీంతో టెక్సాస్ సహా ఆరు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి విధించారు. తన నగరంలో 1.3 మిలియన్ల మందికి విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని హోస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్ అన్నారు. వీలైనంత త్వరగా విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నామని.. ఇదే మొదటి ప్రాథాన్యత అని అన్నారు.