న్యూస్ రిపోర్టర్ సాహసం ... మెడలోతు నీటిలో నుంచి రిపోర్టింగ్ (Video)

మంగళవారం, 30 ఆగస్టు 2022 (14:37 IST)
పాకిస్థాన్ దేశాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. ఆ దేశంలో కురిసిన భారీ వర్షాలు దెబ్బకు గత 30 యేళ్ళలో ఎన్నడూ చూడని విధంగా వరదలు సంభవించాయి. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలో తమ దేశంలోని వరదల పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు ఓ టీవీ జర్నలిస్ట్ పెద్ద సాహసమే చేశారు. మెడలోతు నీటిలో దిగిన అక్కడ నుంచి రిపోర్టింగ్ చేశాడు. వార్తలను ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఆ రిపోర్టర్ ఇంత పెద్ద సాహసం చేశారు. ఈ కవరేజ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అయింది. 
 
తమ దేశంలో నెలకొన్న వరద వాస్తవ పరిస్థితిని ప్రపంచానికి చూపించేందుకు ఆ రిపోర్టల్ మెడలోతు నీటిలో దిగారు. అతని శరీరం మొత్తం నీటిలో మునిగిపోయింది. తల, మైక్ మాత్రమే వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రిపోర్టర్ అంకితభావానికి, పనితీరుకు ఈ వీడియో నిదర్శనమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
అలాగే రిపోర్టర్ ప్రమాదంలో పడేసినందుకు న్యూస్ చానెల్‌పై కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. "అత్యంత కఠిన పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేసినందుకు మీకు హ్యాట్సాఫ్ సార్" అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం ఈ పాకిస్థాన్ రిపోర్టర్ చేసిన సాహసం సోషల్ మీడియాలో పుణ్యమాని ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. 

 

Dangerous,deadly,killer #Pakistani #Reporting..

There is #FloodinPakistan and news channels,army and #ImranKhan too

All 4 become uncontrollable,can do anything..#PakistanFloods #PakArmy #flood pic.twitter.com/aI5KeRsiwL

— Anurag Amitabhانوراگ امیتابھअनुराग अमिताभ (@anuragamitabh) August 27, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు