కాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి రష్యా పర్యటన నేపధ్యంలో దీనిపై అమెరికా, పశ్చిమ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ యుద్ధ సమయంలో ఇమ్రాన్ పర్యటించడంపై ఆ దేశంతో సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై పాకిస్తాన్ లోనే కాకుండా వెలుపల కూడా చాలామంది వీక్షిస్తున్నారు.
అయితే పాకిస్తాన్ అధికారులు సందర్శన సమయాన్ని తగ్గించారు, అయితే ఈ పర్యటన పాక్ ప్రధానికి రెండంచుల కత్తి వంటిదని అంటున్నారు. ఐతే నెటిజన్లు ఇమ్రాన్ ఖాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ సమయంలో మాస్కోను సందర్శించడం అవసరమా అని ప్రశ్నిస్తూ మీమ్స్‌ను పంచుకుంటున్నారు.