పొరుగు దేశం పాకిస్థాన్లో దారుణం జరిగింది. ప్రముఖ పాక్ మోడల్ నయాబ్ నదీమ్ దారుణ హత్యకు గురైంది. ఆమెను గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశారు. అంతేకాకుండా, ఆమె నగ్నమృతదేహాన్ని ఇంట్లో పడేసి హంతకులు వెళ్లిపోయారు. ఈ విషయం ఆమె సవతి సోదరుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.
దీనిపై నయాబ్ సవతి సోదరుడు నసీజ్ స్పందిస్తూ, శనివారం అర్థరాత్రి తామిద్దరు ఐస్క్రీం తినడానికి బయటకు వెళ్లామనీ, ఆ తర్వాత నేను ఆమెను ఇంట్లో వదిలిపెట్టి మా ఇంటికి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లాక నాకు నయాబ్ కాల్ చేసింది. కానీ పడుకుని ఉండటంతో నేను ఫోన్ తీయలేదు. ఆదివారం ఉదయం తిరిగి కాల్ చేయగా, ఆమె తీయలేదు. దీంతో ఆమెను చూడటానికి వెళ్లగా, ఇంట్లో భయానక దృశ్యం కనిపించిందన్నారు.
ఆమెను గొంతు కోయడంతో రక్తస్రావం బాగా జరిగింది. దీంతో ఆమె మృతదేహం రక్తం మడుగులో పడివుంది. ఆ దృశ్యం చూడగానే భయంతో వణికిపోయారు. ఆ తర్వాత తేరుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాను. నయాబ్ బాత్రూం కిటికి పగిలిపోయి ఉంది. దుండగులు దాని గుండా ఇంట్లో చొరబడి తనను హత్య చేసి ఉంటారు. నగ్న మృతదేహాన్ని టీవీ ఉండే హాలులో పడేసి వెళ్లారని వివరించారు. దీనిపై పాక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.