అమెరికాలో మళ్లీ వెలుగు చూసిన పోలియో కేసు

ఆదివారం, 24 జులై 2022 (14:54 IST)
అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పోలియో కేసు వెలుగు చూసింద. గత 2013 తర్వాత ఈ దేశంలో ఒక పోలియో కేసును అమెరికా అధికారులు గుర్తించారు. నిజానికి పోలియో నోటి చుక్కల కార్యక్రమాన్ని అమెరికా గత 2000లోనే నిలిపివేచింది. ఇంజెక్షన్ రూపంలో ఇస్తుంది. ఆ తర్వాత 2013 నుంచి ఒక్క కేసు కూడా వెలుగు చూడలేదు. కానీ, ఇపుడు ఓ కేసు వెలుగు చూడటంతో అధికారులు
అప్రమత్తమయ్యారు. 
 
అయితే, ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే టీకాలో మృత వైరస్ ఉంటుంది. అదే చుక్కల రూపంలో అత్యంత బలహీనమైన వైరస్ ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. బలహీన వైరస్‌ను పంపండ వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి శరీరంలోని పోలియో వైరస్‌ను గుర్తిస్తుంది. భవిష్యత్‌లో శక్తిమంతమైన వైరస్ వచ్చినప్పుడు దానితో పోరాడుతుంది. అయితే, తాజాగా వెలుగు చూసిన కేసులో బాధితుడు పోలియో బారినపడటానికి ఈ బలహీన వైరస్సే కారణమై ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు