బాంబు పేలుళ్ళలో దద్ధరిల్లిన మొగధిషు - 100 మంది మృతి

ఆదివారం, 30 అక్టోబరు 2022 (18:21 IST)
సోమాలియా దేశంలో భారీ పేలుడు సంభవించింది. రెండు శక్తిమంతమైన పేలుళ్ళు చోటుచేసుకున్నాయి. దీంతో ఆ దేశ రాజధాని మొగదిషు దద్ధరిల్లిపోయింది. ఈ పేలుళ్ళలో దాదాపు 100 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరో 300 మంది వరకు గాయపడ్డారు. 
 
స్థానికంగా రద్దీగా ఉండే జోబ్ కూడలి సమీపంలోని విద్యాశాఖ కార్యాలయం వెలుపల ఈ పేలుడు సంభవించింది. మొదటి పేలుడు సంభవించిన తర్వాత క్షతగాత్రులను సహాయం చేసేందుకు అంబులెన్సులు, పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. ఆ సమయంలో రెండో పేలుడు జరిగింది. ఈ పేలుళ్ళ ధాటికి చుట్టుపక్కల భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. పేలుళ్లు జరిగిన ప్రాంతం మరుభూమిగా మారిపోయింది. 
 
ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే కూడలిని జరిగిన పేలుళ్లలో 500 మందికిపై ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ పేలుళ్ళపై ఆ దేశ అధ్యక్షుడు హాసన్ షేక్ మొహమ్మూద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు