టోర్నడోల బీభత్సం - పెనుగాలులకు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు (Video)

ఠాగూర్

ఆదివారం, 16 మార్చి 2025 (12:05 IST)
అగ్రరాజ్యం అమెరికాను టోర్నడోస్ వణికిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలలో పెనుగాలులు విధ్వంసం స్పష్టించాయి. వంద కిలోమీటర్ల వేగంతో వీస్తున్నగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రోడ్లపై వెళుతున్న వాహనాలు బోల్తాపడ్డాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 34 మంది మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. కెనడా నుంచి టెక్సాస్ వైపు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
టోర్నడోల ధాటికి మిస్సోరీలో 12 మంది, ఆర్కన్సాస్‌లో ముగ్గురు, కాన్సాస్‌లో 8 మంది మిస్సిస్సిప్పీలో ఆరుగురు, టెక్సాస్‌లో నలుగురు మరణించారు. ఆర్కన్సాస్‌లో 29 మందికి పైగా గాయపడ్డారు. కార్చిచ్చులు చెలరేగడంతో ఓక్లహోమా, మిస్సోరీ, న్యూ మెక్సికో, టెక్సస్, కాన్సస్‌లలో ఆయా ప్రాంతాల నుంచి జనాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మిన్నెసోటా, సౌత్ డకోటాలోని పలు ప్రాంతాలకు మంచు తుఫాను ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. 

 

#BREAKING #USA #MISSISSIPPI #MS

???? MISSISSIPPI : AFTERMATH OF A MASSIVE TORNADO IN TYLERTOWN,

showcasing the extensive damage left behind.#Ultimahora #Tornado #Tornade #Tormenta pic.twitter.com/cy1Iddelnj

— LW World News ???? (@LoveWorld_Peopl) March 15, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు