ప్రపంచ దేశాల మాటలు నమ్మి నట్టేట మునిగిన ఉక్రెయిన్

శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (07:04 IST)
ఉక్రెయిన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ప్రపంచ దేశాల మాటలు నమ్మి నట్టేట మునిగింది. పుట్టుకతోనే ఐదు వేల అణ్వాయుధాలు కలిగి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అణుశక్తిగా ఉన్న దేశం ఉక్రెయిన్. కానీ, ఇపుడు ఆ అణ్వాయుధాలన్నీ ఏమయ్యాయి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 
 
ముఖ్యంగా, తమకు అండగా, బాసటగా ఉంటామని ప్రపంచ దేశాలు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మింది. దానికి ఫలితం ఇపుడు అనుభవిస్తుంది. ఈ దేశాల మాటలు నమ్మి అణ్వాయుధాలను త్యజించింది. జాతీయ భద్రతను ప్రపంచ దేశాల చేతిలో పెట్టింది. ఇపుడు ఫలితం అనుభవిస్తుంది. 
 
తమ భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి బాంబుల వర్షం కురిపిస్తుంటే ఉక్రెయన్ ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. పైగా, ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురు చూస్తుంది. దీనికితోడు పరాయి దేశాలకు అడుగులు మడుగులొత్తే వారు అధికారంలోకి రావడంతో ఉక్రెయిన్‌కు శాపంగా మారింది. 
 
ఫలితంగా దేశ రక్షణ కోసం నిస్సహాయంగా ఆర్తనాదాలు చేస్తుంది. నాడు ముచ్చట్లు చెప్పిన దేశాలు ఒక్కటి కూడా పూర్తి సాయానికి రావడం లేదు. దీంతో మౌనంగా తమకు జరిగిన అన్యాయానికి ఉక్రెయిన్ ప్రజలు కుమిలిపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు