ఆఫర్ కాదు.. ఆయుధాలు కావాలి .. చేతనైతే నా దేశాన్ని రక్షించండి : జెలెన్ స్కీ

శనివారం, 26 ఫిబ్రవరి 2022 (13:29 IST)
రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అగ్రరాజ్యం అమెరికాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను పదవీచ్యుతుడిని చేయడం కాదు.. చేతనైతే నా దేశాన్ని రక్షించండి అంటూ ఆయన అన్నారు. పైగా, తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్న ఆఫర్‌ను ఆయన నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య యుద్ధానికి దారితీసేలా పరిస్థితులు సృష్టించి తీరా యుద్ధం మొదలయ్యాక ఆయుధాలు, బలగాలు పంపకుండ రష్యాపై ఆంక్షలు, ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలతో సరిపెట్టారంటూ అమెరికాను దెప్పిపొడిచారు. 
 
తనను ఉక్రెయిన్ నుంచి తప్పిస్తారంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రతిపాదనపై ఆయన మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు కావాల్సింది ఆఫర్లు కాదు.. ఆయుధాలు అంటూ అమెరికా అధినేత బైడెన్‌కు కౌంటరిచ్చారు. పైగా, దేశ ప్రజల కంటే తనకు తన ప్రాణాలు ముఖ్యం కాదన్నారు. 
 
కాగా, ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న రష్యా సైనిక బలగాలు ఏ క్షణమైనా జెలెన్‌ స్కీని బందీగా పట్టుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఆయన ప్రాణాలు ముప్పు తప్పదని అమెరికా అనుమానిస్తుంది. దీంతో ఆయన్ను సురక్షితంగా దేశం నుంచి తరలించేందుకు ప్రత్యేక బలగాలు పంపుతామని బైడెన్ అన్నారు. ఈ ఆఫర్‌ను ఆయన తోసిపుచ్చారు. కీవ్‌లోన ఉంటానని చెప్పారు. మీకు చేతనైతే ఆయుధాలు అందించి, బలగాలు పంపించాలని సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు