డొనాల్ట్ ట్రంప్‌ చేయిపట్టుకుంటే.. మెలానియా ట్రంప్ ఇలా? (వీడియో)

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (18:21 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో ఇజ్రాయేల్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ట్రంప్ సతీమణి మెలానియా ఆయనతో చేతులు కలిపి నడిచేందుకు నిరాకరించారు. అదేవిధంగా ప్రస్తుతం ఒహియో వెళ్లేటప్పుడూ ట్రంప్‌కు అదే పరిస్థితి ఎదురైంది.

సోమవారం ఓహియోకు ట్రంప్ దంపతులు బయల్దేరారు. ఆ సమయంలో ఇంటి ముందు నడుస్తూ వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. మెలానియా చేతులు పట్టుకుని నడిచేందుకు ప్రయత్నించారు. 
 
అయితే ఆమె అందుకు నిరాకరించారు. కానీ పొడవాటి ఓవర్ కోట్ ధరించడంతోనే మెలానియా చేయిని ట్రంప్ అందుకోలేకపోయారు. దీంతో వారిద్దరూ విడివిడిగానే నడుచుకుంటూ విమానం ఎక్కారు.

ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ లుక్కేయండి. 

WATCH: President Trump and First Lady Melania Trump depart the White House on their way to Ohio pic.twitter.com/unoZ5xyEXN

— NBC News (@NBCNews) February 5, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు