కెప్టెన్ అయ్యాక రోహిత్ శర్మను కలిసిన హార్దిక్ పాండ్యా

సెల్వి

గురువారం, 21 మార్చి 2024 (17:17 IST)
ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ మార్పు సోషల్ మీడియాలో పెను దుమారాన్నే రేపింది. ముంబై ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా ఎంపిక కావడాన్ని రోహిత్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. గుజరాత్ టైటాన్స్‌కు ఒక టైటిల్, ఓ ఫైనల్‌ వరకు నడిపించిన హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడంపై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై ఫ్యాన్స్ మండిపడ్డారు. 
 
రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ యొక్క విశిష్ట కెప్టెన్‌గా మాత్రమే కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యంత విజయవంతమైన నాయకులలో ఒకరిగా కూడా నిలిచాడు. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానంలో ఎంపికైన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తొలిసారి హిట్ మ్యాన్‌ను కలిశాడు. 
 
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తమ మొదటి శిక్షణా సెషన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, కెప్టెన్సీ మార్పు తర్వాత పాండ్యా- రోహిత్ ఇద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు