ఐపీఎల్‌లో అరుదైన రికార్డు.. ఏడువేల పరుగులు సాధించిన కోహ్లీ
శనివారం, 6 మే 2023 (21:18 IST)
అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల పంట పండించిన విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లోనూ అరుదైన ఘనతను సాధించాడు. లీగ్ మ్యాచ్‌ల్లో ఎవరూ సాధించని రీతిలో ఏడువేల పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు నమోదు చేసుకున్నాడు. 34 ఏళ్ల కోహ్లీ 225వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ శనివారం జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఏడువేల పరుగుల మార్కును అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఏడువేల పరుగుల మైలురాయిని తాకిన ఆటగాడు లేడు.
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూనే వున్నాడు. ఆర్సీబీ తరఫున కోహ్లీ సాధించిన పరుగుల్లో 50 అర్ధసెంచరీలు, 5 సెంచరీలు ఉన్నాయి.