ఎయిర్‌టెల్ 5జీ సేవలు తొలుత ప్రీమియర్ వినియోగదారులకే..

మంగళవారం, 23 ఆగస్టు 2022 (15:21 IST)
దేశంలో ఈ యేడాది ఆఖరు నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను తొలుత ప్రీమియం కస్టమర్లకే అందించనున్నారు. దీనికి కారణం లేకపోలేదు. తొలుత అధిక చార్జీలతో కూడిన ప్లాన్లను ముందుగా అమలు చేయనుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ ప్రమోటర్ భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ గుప్తా వెల్లడించారు. ఆ తర్వాత మిగిలిన కష్టమర్లకు 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. 
 
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, ఒక విధంగా చెప్పాలంటే దిగువ స్థాయి, బడ్జెట్ ప్లాన్లకు 5జీసేవలను తొలుత అందించే ఉద్దేశ్యం లేదని గుప్తా చెప్పినట్టు సమాచారం. 5జీ సేవలకు ప్రీమియం చార్జీలు విధించడం వేరు... ప్రీమియం ప్లాన్లకు 5జీ సేవలను పరిమితం చేయడం వేరని ఆయన వివరించారు. 
 
"తన అభిప్రాయం ప్రకారం 5జీ వినియోగం అన్నది చాలా వేగంగా పెరుగుతుంది. 5జీ హ్యాండ్  సెట్‌ కలిగినవారు 5జీ సేవలను పొందగలరు. తమకు తెలియకుండానే వారు ఎక్కువ డేటాను వినియోగించడం వల్ల అధిక టాఱిప్ ప్లాన్‌లోకి వెళ్లిపోతారు. ఇది అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు