అసుస్ నుంచి అత్యంత శక్తివంతమైన ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లతో కన్స్యూమర్‌ ల్యాప్‌టాప్‌

మంగళవారం, 10 నవంబరు 2020 (18:33 IST)
తైవాన్‌కు చెందిన సుప్రసిద్ధ ఎలకా్ట్రనిక్స్‌ సంస్థ అసుస్‌ ఇటీవలనే తమ తాజా శ్రేణి ఇంటెల్‌ శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. వీటిలో వివో బుక్‌ అలా్ట్ర 14/15 (ఎక్స్‌413/ఎక్స్‌513), వివోబుక్‌ అలా్ట్ర కె15(కె513) మరియు జెన్‌బుక్‌ 14(యుఎక్స్‌ 425) ఉన్నాయి. వినియోగదారుల అనుభవాలను మెరుగుపరుస్తామనే తమ నిబద్ధతకు అనుగుణంగా, అసుస్‌ ఇప్పుడు జెన్‌ జెడ్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత ఖచ్చితత్త్వంతో కూడిన ఇంజినీరింగ్‌తో ఈ మొత్తం శ్రేణి ఉపకరణాలను రూపొందించింది. తాజా 11వ తరపు ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లుతో కూడిన ఈ అలా్ట్ర స్లిమ్‌ డిజైన్‌, చూడగానే సంతృప్తి పరిచే సౌందర్యం, కస్టమ్‌ ఇంటిలిజెంట్‌ కూలింగ్‌ పరిష్కారాలు, వేగవంతమైన ర్యామ్‌, విస్తరించతగిన స్టోరేజీ, నానో ఎడ్జ్‌ డిస్‌ప్లేతో కూడిన ఈ అత్యంత శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లు మెరుగైన పనితీరు, లీనమయ్యే విజువల్స్‌, ఎదురులైని పనితీరు అందిస్తాయి.
 
ఈ ఆవిష్కరణ సందర్భంగా అర్నాల్డ్‌ సు, బిజినెస్‌ హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, అసుస్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘ప్రతి నూతన ఆఫరింగ్‌తో మమ్మల్ని మేము అధిగమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ నూతన శ్రేణి అందుకు మినహాయింపేమీ కాదు. వివో బుక్‌ అలా్ట్ర మరియు జెన్‌ బుక్‌ సిరీస్‌లో తాజా ప్రవేశంతో, అత్యంత శక్తివంతమైన పనితీరును అందించాలన్నది మా లక్ష్యం, దీనితో పాటుగా లీనమయ్యే విజువల్స్‌ మరియు మా వినియోగదారుల కోసం ఉత్సాహపూరితమైన ఫీచర్లతో కూడిన అప్‌గ్రేడ్స్‌ను సైతం అందించనున్నాం.
 
మెరుగైన పోర్టబిలిటీ కోసం అత్యున్నత హార్డ్‌వేర్‌ డిజైన్‌ మొదలు, అతి సరళమైన మరియు భారీ కార్యకలపాలను సైతం సులభవంతంగా చేయడానికి తగినట్లుగా ప్రాసెసింగ్‌ శక్తి వంటివన్నీ కూడా ఈ ల్యాప్‌టాప్‌లలో ఉంటాయి. ఈ రెండు సిరీస్‌లనూ అత్యంత ఖచ్చితత్త్వంతో జెనరేషన్‌ జెడ్‌ తరం కోసం తీర్చిదిద్దారు. భారతదేశపు ఉద్యోగులలో అత్యంత కీలకంగా వృద్ధి చెందుతున్న సభ్యులు వీరు. అసుస్‌ ఉత్పత్తులు వారి చేతులలో ఉండటం ద్వారా వారు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన కార్యకలాపాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా చేయగలరు’’ అని అన్నారు
 
రాహుల్‌ మల్హొత్రా, డైరెక్టర్‌–రిటైల్‌, ఇంటెల్‌ ఇండియా మాట్లాడుతూ ‘‘ ఇంటెల్‌ ఐరీస్‌ ఎక్స్‌ఈ గ్రాఫిక్స్‌తో కూడినటువంటి తాజా 11వ తరపు ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు, ఉత్పాదకత, మహోన్నత సహకారం, కంటెంట్‌ సృష్టి, గేమింగ్‌, వినోదం పరంగా సాటిలేని సామర్థ్యాలను తీసుకువస్తుంది. 11వ తరపు ఇంటెల్‌ కోర్‌తో శక్తివంతమైన సిస్టమ్స్‌ వాస్తవ పనితీరు ను అప్లికేషన్‌లపై గరిష్టం చేయడంతో పాటుగా ప్రజలు అధికంగా వినియోగించు ఫీచర్లపై కూడా అత్యుత్తమంగా పనిచేసి  పలుచటి మరియు తేలికపాటి ల్యాప్‌టాప్‌లపై వినియోగదారుల అనుభవాల పరంగా మహోన్నతతను అందిస్తుంది...’’ అని అన్నారు.
 
జెన్‌ బుక్‌ 14 (యుఎక్స్‌425) యొక్క కొన్ని అత్యుత్త ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి
అల్ట్రా స్లిమ్, అల్ట్రా లైట్, అల్ట్రా పోర్టబుల్: అసుస్‌ జెన్‌బుక్‌ 14 యుఎక్స్‌ 425ను డైమండ్‌ కట్‌ అల్యూమినియం అల్లాయ్‌తో నిర్మించారు. జెన్‌బుక్‌ సిరీస్‌ యొక్క విలాసవంతమైన సౌందర్యం, మృదుత్వం దృష్టిలో పెట్టుకుని ఈ నూతన ల్యాప్‌టాప్‌లో వినూత్నమైన కాంక్రీట్‌ సర్కిల్‌ ఫినీష్‌ లిడ్‌పై ఉంది. అతి తేలికగా 1.13 కేజీ బరువు కలిగిన జెన్‌బుక్‌ 14, సూపర్‌ సొగసైన రూపకాన్ని కలిగి ఉంది. దీని తేలికపాటి మరియు పలుచటి డిజైన్‌ దీనికి దోహదపడుతుంది. దీని సైడ్‌ ప్రొఫైల్‌ 14మిల్లీమీటరుల కన్నా తక్కువగా ఉండటంతో పాటుగా ఎక్కడైనా మరియు ఏ సమయంలో అయినా వినియోగించేందుకు అనువుగా ఉంటుంది.
 
సూపర్‌ శక్తివంతమైన ప్రాసెసింగ్‌ ద్వారా సూపర్‌ మొబిలిటీ పరిపూర్ణం అవుతుంది: అత్యాధునిక 11వ తరం ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు మరియు ఇంటెల్‌ ఐరీస్‌ ఎక్స్‌ గ్రాఫిక్స్‌తో శక్తివంతమైన నూతన జెన్‌బుక్‌ 14 అంగుళాల మెరుగైన పనితీరును అందించడంతో పాటుగా బహుళ మల్టీటాస్కింగ్‌, ఉత్పాదకత, వినోదాన్ని ఒకే సమయంలో అందిస్తుంది. అలా్ట్రఫాస్ట్‌ పీసీఐఈ 3.0 ్ఠ 2 ఎస్‌ఎస్‌డీతో కూడిన మరియు అత్యాధునిక వైఫై 6 (802.11ఏఎక్స్‌) కలిగిన ఈ నూతన ల్యాప్‌టాస్‌లు అత్యద్భుతమైన, సంపూర్ణమైన పనితీరును అందిస్తుంది.
 
ఖచ్చితత్త్వంతో కూడిన ఇంజినీరింగ్‌తో ఎర్గోలిఫ్ట్‌ హింజ్‌: ఖచ్చితమైన ఇంజినీరింగ్‌తో కూడిన ఎర్గోలిఫ్ట్‌ హింజ్‌ను జెన్‌బుక్‌ 14 కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌ను తెరిచినప్పుడు ఇది స్వయం చాలకంగా ల్యాప్‌టాప్‌ను కొద్దిగా పైకి తెరుస్తుంది. అంతేకాకుండా కీబోర్డ్‌ను  అత్యుత్తమంగా టైపింగ్‌ యాంగిల్‌కు తీర్చిదిద్దుతుంది. ఇది మెరుగైన కూలింగ్‌ మరియు వృద్ధి చేసిన ఆడియో నాణ్యతను సైతం అందిస్తుంది.
 
అసాధారణంగా లీనమయ్యేందుకు  అత్యద్భుతమైన విజువల్స్‌: నూతన జెన్‌బుక్‌ 14పై 90% స్ర్కీన్‌ టు బాడీ రేషియో వరకూ కలిగిన ఈ ఉపకరణం అసాధారణ వీక్షణ అనుభవాలను వినియోగదారులకు అందిస్తుంది. నాలుగు వైపులా నానో ఎడ్జ్‌ డిస్‌ప్లే, ల్యాప్‌టాప్‌లపై ఉండటం వల్ల సైడ్‌ బీజెల్స్‌ ఇప్పుడు గణనీయంగా 2.5 మిల్లీమీటర్లకు తగ్గించబడింది. అదనంగా,  ఫుల్‌ హెచ్‌డీ ఐపీఎస్‌ ఎల్‌ఈడీ ప్యానెల్‌ అసాధారణంగా రంగులను పునరుత్పత్తి చేసి లీనమయ్యే వీక్షణ కోణాలనూ అందిస్తాయి.
 
క్లిష్టత లేని కనెక్టివిటీ: 11వ తరపు ఇంటెల్‌ కోర్‌ ప్రాసెసర్లు, థండర్‌బోల్ట్‌ 4 యుఎస్‌బీ –సీ పోర్ట్స్‌ను జెన్‌బుక్‌ 14ను 40జీబీపీఎస్‌ వేగాన్ని అందిస్తాయి. ఈ ల్యాప్‌టాప్‌లు స్టాండర్డ్‌ హెచ్‌డీఎంఐ 2.0 పోర్ట్‌ను కలిగి ఉండటంతో పాటుగా యుఎస్‌బీ 3.2 జెన్‌ 1 టైప్‌ ఏ పోర్ట్‌ మరియు మైక్రో ఎస్‌డీ కార్డ్‌  రీడర్‌ను కలిగి ఉన్నాయి. థండర్‌బోల్ట్‌ 4తో, ఈ ల్యాప్‌టాప్‌ అతి సులభంగా రెండు 4కె డిస్‌ప్లేలు లేదా 8కె డిస్‌ప్లేను అందించడంతో పాటుగా స్టోరేజీ ఉపకరణాలు లేదా విస్తరణ కనెక్షన్స్‌ మరియు మరెన్నో అందిస్తుంది.  విప్లవాత్మక డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై 6 (802.11ఏఎక్స్‌) కలిగి ఉంది. ఇది  వైఫై 5 (802.11ఏసీ) కన్నా 2.7 రెట్లు వేగంగా అందించడంతో పాటుగా జెన్‌బుక్‌ 14లో అసుస్‌ వైఫై మాస్టర్‌ టెక్నాలజీ సైతం ఉంది. ఇది వైఫై కనెక్షన్స్‌ను మరింత దూరంగా, వేగంగా మరియు అత్యంత సులభంగా వినియోగించుకునేలా మారుస్తుంది.
 
చార్జర్‌ ఇక పెద్ద అవసరం ఏమీ కాదు: నూతన జెన్‌బుక్‌ 14తో, చార్జర్‌ లేకుండా ప్రయాణించడం పెద్ద సమస్య ఏమీ  కానేరదు. ఈ ఉపకరణాలు 67 వాట్‌ హవర్‌ బ్యాటరీతో వస్తాయి. ఇవి గరిష్టంగా 21 గంటల చార్జింగ్‌ను అందిస్తాయి. దీనిలోని ఫాస్ట్‌ ఛార్జ్‌ ఫీచర్‌తో 60% వరకూ బ్యాటరీని కేవలం 49  నిమిషాలలో చార్జ్‌ చేయవచ్చు. తద్వారా ఏ సమయంలో అయినా సమయానికి ఉన్నట్లుగా నిలుపుతుంది!
 
వివోబుక్‌ అలా్ట్ర 14/15 (ఎక్స్‌413/ఎక్స్‌513) మరియు వివోబుక్‌ అలా్ట్ర కె 15 (కెఎస్‌13) లు కొన్ని సాధారణ ఫీచర్లు కలిగి ఉన్నాయి. వీటిలో జెనరేషన్‌ జెడ్‌ కోసం ప్రత్యేక శ్రద్ధతో డిజైన్‌ చేశారు. అసుస్‌ వివోబుక్‌ అలా్ట్ర 14/15 మరియు వివో బుక్‌ అలా్ట్ర కె15 లు వివోబుక్‌ ఎస్‌ ఎస్‌ 14 /వివోబుక్‌ ఎస్‌ ఎస్‌15 సిరీస్‌ను అనుసరించాయి. ఈ నూతనతరపు ల్యాప్‌టాప్‌లు డిజైన్‌ పరంగా గణనీయంగా మెరుగుపరచబడ్డాయి మరియు ఇవి బహుళ రంగుల శ్రేణి అవకాశాలను కలిగి ఉన్నాయి. వీటిలో బీస్పోక్‌ బ్లాక్‌ ; డ్రీమీ వైట్‌ మరియు కొబాల్ట్‌ బ్లూలు వివోబుక్‌ అలా్ట్ర 14/15 కు ఉన్నాయి. ఈ పోర్టబిలిటీ ఫ్యాక్టర్‌ను మరింతగా వృద్ధి చేస్తూ వివోబుక్‌ అలా్ట్ర 14/15 మరియు వివో బుక్‌ అలా్ట్ర కె 15 అకాశాలతో కూడిన అలా్ట్ర స్లిమ్‌ ల్యాప్‌టాప్‌లను అతి తేలికగా మరియు అత్యున్నత మన్నిక కలిగి ఉండేటట్లు తీర్చిదిద్దారు. ఇదే రీతిలో, వివోబుక్‌ అలా్ట్ర కె15 ఛాసిస్‌ (ఏ, సీ,డీ పార్ట్‌) అల్యూమినియం అల్లాయ్‌ మరియు ప్లాస్టిక్‌ను మిళితం చేసుకుని అదే తరహా మన్నిక మరియు తేలిక కలిగి ఉంటుంది. ఈ సిరీస్‌లోని మోడల్స్‌ ఇండీ బ్లాక్‌, ట్రాన్స్‌పరెంట్‌ సిల్వర్‌, హార్టీ గోల్డ్‌ రంగుల అవకాశాలలో ఉంటాయి.
 
గరిష్ట కంప్యూటింగ్‌ శక్తి మరియు ఆధునీకరించిన పనితీరును అన్‌లాక్‌ చేయండి
 
ఇంటెల్‌ ఐరీస్‌ ఎక్స్‌ గ్రాఫిక్స్‌తో కూడిన ఇంటెల్‌ కోర్‌ ఐ7–1165జీ7 ప్రాసెసర్లు కలిగిన వివోబుక్‌ అలా్ట్ర 14/15 మరియు వివో బుక్‌ కె513 ల్యాప్‌టాప్‌లు టర్బో బూస్ట్‌ ఫ్రీకెన్సీని 4.7 గిగాహెర్ట్జ్‌ వరకూ అందిస్తుంది. ఈ ల్యాప్‌ట్యాప్‌లు  నివిడియా ఎంఎక్స్‌330జీపీయు కలిగి ఉండటంతో పాటుగా గ్రాఫిక్స్‌ మద్దతును తరువాత దశకు తీసుకువెళ్తాయి. వీటిని 8జీబీ ర్యామ్‌తో జతకలపడంతో పాటుగా సూపర్‌ఫాస్ట్‌ పీసీఎల్‌ఈ ఎస్‌ఎస్‌డీ సొల్యూషన్‌తో కలుపడం వల్ల, ఈ మెషీన్‌ గరిష్ట  పనితీరును అందిస్తాయి. జిప్పీ ఎస్‌ఎస్‌డీతో పాటుగా ఈ రెండు అవకాశాలూ విస్తరించిన స్టోరేజీని 1టీబీ సటా హెచ్‌డీడీతో అందిస్తాయి.
 
అత్యున్నత అనుభవాలను అందించే లీనమయ్యే విజువల్స్‌
14 అంగుళాలు మరియు 15.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ నానో ఎడ్జ్‌ డిస్‌ప్లే నూతన వివోబుక్‌ ల్యాప్‌టాప్‌లపై ఉండటంతో పాటుగా వినియోగదారులకు ఎదురులేనట్టి వీక్షణ అనుభవాలను అందిస్తాయి. స్లిమ్డ్‌ డౌన్‌ టాప్‌ మరియు సైడ్‌ డిస్‌ప్లే బీజెల్స్‌తో పాటుగా స్ర్కీన్‌ టు బాడీ రేషియో 85% వరకూ ఉండి, మరిచిపోలేనట్టి ముద్రను మరియు అసాధారణంగా లీనమయ్యే అనుభూతులను అందిస్తుంది. ఫుల్‌ హెచ్‌ ఎల్‌ఈడీ ప్యానెల్‌ చక్కటి రంగులను పునరుత్పత్తి చేయడంతో పాటుగా స్ర్కీన్‌ నుంచి విజువల్స్‌ బయటకు వచ్చినట్లుగా మారుస్తాయి.
 
సమగ్రమైన కనెక్టివిటీ అవకాశాలు
వివోబుక్‌ అలా్ట్ర 14/15 మరియు వివోబుక్‌ అలా్ట్ర కె 15పై పూర్తిస్థాయి ఐ/ఓ పోర్ట్స్‌తో ఎల్లప్పుడూ కనెక్ట్‌ అయి ఉండండి. అంతర్గతంగా నిర్మించిన ఇంటెల్‌ వై–ఫై 6 గిగ్‌+(802.11ఏఎక్స్‌) వైర్‌లెస్‌నెట్‌వర్క్‌ను కలిగి ఉండటంతో పాటుగా మృదువైన వై–ఫై కనెక్టివిటీ అనుభవాలను అందిస్తుంది. ఈ ఉపకరణాలు క్లిష్టత లేని కనెక్టివిటీని సాధ్యం చేయడంతో పాటుగా 2.4జీబీపీఎస్‌ వరకూ వేగాలను చేరుకునేందుకు దోహదపడుతుంది. మూడు రెట్ల అత్యధిక థ్రూపుట్‌ మరియు 4 రెట్ల నెట్‌వర్క్‌ సామర్థ్యంను వైఫై 5 (802.11ఏసీ)తో పోల్చినప్పుడు అందిస్తుంది. ఈ నూతన ల్యాప్‌టాప్స్‌లో హెచ్‌డీఎంఐ 1.4 పోర్ట్‌,  రెండు యుఎస్‌బీ 2.0 టైప్‌ –ఏ ; ఒక యుఎస్‌బీ 2.3 జెన్‌  1 టైప్‌ –ఏ మరియు యుఎస్‌బీ 2.3 జెన్‌ 1 టప్‌ – సీ పోర్ట్‌ కూడా ఉన్నాయి.
 
టైపింగ్‌ అనుభవాలను మరలా కనుగొనండి
నూతన వివోబుక్‌ అలా్ట్ర 14/15 మరియు వివోబుక్‌ అలా్ట్ర కె15 లు సౌకర్యవంతమైన, పూర్తిస్థాయి కీబోర్డ్‌ను కలిగి ఉన్నాయి. ఈ కీపిచ్‌ దాదాపు 19 మిల్లీమీటర్ల వెడల్పు (కీ మధ్య భాగం నుంచి దాని తరువాత కీ మధ్యభాగం వరకూ) కలిగి ఉన్నాయి. ఈ పిచ్‌ అదే తరహా ఖచ్చితత్త్వం కలిగి ఉండటంతో పాటుగా డెస్క్‌టాప్‌ పీసీ కీబోర్డులలా ల్యాప్‌టాప్‌లలో చిన్న రూపం కలిగి నప్పటికీ అదే తరహా విలాసాన్ని టైపింగ్‌ సమయంలో అందిస్తుంది. ఈ కీబోర్డ్‌ కేవలం బ్లాక్‌లిట్‌ కావడమే కాదు, ాకటి వాతావరణంలో సైతం సౌకర్యవంతమైన టైపింగ్‌ను అందించడంతో పాటుగా చిరు జల్లు పడినప్పటికీ పాడవకుండా ఉంటుంది.
 
అసుస్‌ ఇంటిలిజెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ టెక్నాలజీ (ఏఐపీటీ)
అసుస్‌ ఇంటిలిజెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ టెక్నాలజీ (ఏఐపీటీ) అనేది అలా్ట్ర ఎఫీషియెంట్‌ థర్మల్‌ డిజైన్‌ కలిగి ఉండటంతో  పాటుగా ఇంధన పొదుపు పరిష్కారం సైతం కలిగి ఉంది. ఇది అసుస్‌ ఎక్స్‌క్లూజివ్‌ అల్గారిథమ్స్‌ను ఐదు మరియు తొమ్మిది స్మార్ట్‌ సెన్సార్లను మిళితం చేసుకుని ఉంటుంది. ఏరోడైనమిక్‌ ఐస్‌ బ్లేడ్స్‌ ఫ్యాన్‌ డిజైన్‌ మరియు 65 వాట్ల విద్యుత్‌ సరఫరా తెలివిగా సీపీయు పనితీరును మెరుగైన స్థిరత్వంతో వృద్ధి చేస్తుంది. అదే సమయంలో, రోజంతా ఉండేటటువంటి బ్యాటరీ జీవితం మరియు నిశ్శబ్ద మరియు కూలర్‌ ల్యాప్‌టాప్‌గా మారుస్తుంది. ఈ సాంకేతికత, ఈ ఉపకరణాలు పనిచేస్తున్నంత కాలం అధిక పనితీరు స్థితిని కొనసాగించడానికి తగిన శక్తినిస్తుంది. ఇది కేవలం ఐ5 మరియు ఐ7  11వ తరంలో మాత్రమే లభ్యమవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు