భిక్షగాడి చేతిలో రూ. 1.44 లక్షల ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌- నో ఈఎంఐ.. వీడియో వైరల్

సెల్వి

సోమవారం, 20 జనవరి 2025 (13:16 IST)
Begger
ఐఫోన్, ఆపిల్ ఉత్పత్తులపై ఉన్న క్రేజ్ నిజమే. తాజాగా ఓ భిక్షగాడు ఐఫోన్ కొనుగోలు చేశాడు. ఖరీదైన మొబైల్ ఫోన్‌కు సంబంధించిన మరో సంఘటన ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల రాజస్థాన్‌కు చెందిన ఒక బిచ్చగాడు రూ. 1.44 లక్షల విలువైన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను కొనుగోలు చేసి నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. 
 
ఈఎంఏ ఆధారిత కొనుగోలు ద్వారా లేదా పూర్తి చెల్లింపు ద్వారా ఇంటికి ఐఫోన్ తీసుకురావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నప్పటికీ, దాని ధర వారిని ఆందోళనకు గురి చేస్తుంది. 
 
రాజస్థాన్‌లోని అజ్మీర్ నుండి వచ్చిన ఒక వీడియోలో నిరాశ్రయుడైన వ్యక్తి చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను పట్టుకున్నట్లు గల ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ ఫోన్ గత సెప్టెంబర్‌లో మార్కెట్‌లో విడుదలైంది. ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఆపిల్ ఇంటెలిజెన్స్ కోసం తయారు చేయబడిన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర లక్ష రూపాయల కంటే ఎక్కువ. 

भीख मांगने वाले के हाथ में डेढ़ लाख का आईफ़ोन देख हैरान हैं.

भीख मांगने वाले के हाथ में दिखा iPhone 16 Pro Max है. दिलचस्प बात यह है कि इस युवक ने पैसे माँग माँग कर आईफ़ोन ख़रीदा है. pic.twitter.com/pPkxiI3clE

— Priya singh (@priyarajputlive) January 19, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు