బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ల సవరణ.. రూ.97లకు పైబడిన ప్లాన్లకు కొత్త లాభాలు

గురువారం, 14 మే 2020 (17:15 IST)
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీ-పెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను సవరించింది. రూ.97, ఆ పైబడిన ప్లాన్లకు కొత్త లాభాలు వర్తిస్తాయి. మొత్తం 25 ప్లాన్లు, ప్రీపెయిడ్ వోచర్లు, ఫస్ట్ రీచార్జ్ కూపన్లకు వర్తించనుంది. ఎంటీఎన్ఎల్ నెట్ వర్క్ ఉపయోగించే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు కూడా రూ.99, రూ.104, రూ.349, రూ.447 ప్లాన్లపై ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ప్లాన్లపై రోజుకు 250 నిమిషాలు లభించనున్నాయి. 
 
ఎంటీఎన్ఎల్ రోమింగ్ ఉపయోగించే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు రూ.97, రూ.118, రూ.187, రూ.199, రూ.247, రూ.298, రూ.349, రూ.399, రూ.447, రూ.499, రూ.1,098 ప్రీపెయిడ్ ప్లాన్లు, రూ.106, రూ.107, రూ.153, రూ.186, రూ.365, రూ.429, రూ.485, రూ.666, రూ.997, రూ.1,699, రూ.1,999 ఫస్ట్ రీచార్జ్ కూపన్లపై ఈ ఆఫర్ వర్తించనుంది.
 
ఈ ఆఫర్ భారతదేశమంతటా అందుబాటులోకి రానుంది. మొదటగా చెన్నై, తమిళనాడు సర్కిల్లో దీన్ని సవరించనున్నారు. వాయిస్ కాలింగ్ నిమిషాలు, ఎస్ఎంఎస్ మెసేజ్‌లు, డేటా లాభాల్లో ఎలాంటి మార్పులు వుండవని బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు