షాకిచ్చిన బిల్ గేట్స్... బాధ్యతల నుంచి దూరంగా...

శనివారం, 14 మార్చి 2020 (08:40 IST)
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తేరుకోలేని షాకిచ్చారు. సంస్థ డైరెక్టర్ల బోర్డుకు రాజీనామా చేశారు. అలాగే, బెర్క్‌షైర్ హాత్‌వే బోర్డు నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ బాధ్యతల నుంచి దూరంకావడానికి ప్రధాన కారణం ఒక్కటే. ప్రపంచ వ్యాప్తంగా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న చారిటీస్ కార్యక్రమాలకు మరింత సమయాన్ని వెచ్చించేందుకు, పాల్గొనేందుకు అని చెప్పారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బెర్క్‌షైర్ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని, దాతృత్వ కార్యక్రమాలకు మరింత సమయం వెచ్చించేందుకు ఇదే సరైన సమయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
 
బిల్‌గేట్స్ రాజీనామాపై సత్యనాదెళ్ల స్పందించారు. కొన్నేళ్లపాటు బిల్‌గేట్స్‌తో కలిసి పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఆయన నాయకత్వం వల్ల సంస్థకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. బిల్‌గేట్స్‌తో కలిసి పనిచేసేందుకు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు