భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్

ఠాగూర్

మంగళవారం, 5 మార్చి 2024 (10:56 IST)
భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ స్మార్ట్ ‌ఫోనును ఆవిష్కరించింది. ఈ ఫోన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెడ్మీ, రియల్ మీ, మోటరోలా కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీని ఇస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా, ఇది బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ ఇందులో మోస్ట్ పవర్‌ఫుల్ మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెర్ ఉంది. అందువల్ల ఇది గేమింగ్స్‌, వీడియో ఎడిటింగ్‌లకు కూడా సపోర్టు చేసింది. ఈ ఫోనులో 4జీపీ ప్లస్ 128 జీబీ, 6జీబీ ప్లస్ 128 జీబీ అనే రెండు స్టోరేజ్‌ వేరియంట్లు ఉన్నాయి. అయితే మైక్ర్ ఎస్‌డీ కార్డును ఉపయోగించి ఫోన్ స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇకపోతే, ఓఎస్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 అపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. దీనికి నాలుగేళ్ళపాటు ఓఎస్ అప్‌‍డేట్స్ ఇస్తామని శాంసంగ్ కంపెనీ ప్రకటించింది.
 
డిస్ ప్లే.. 6.5 అంగుళాల ఫుల్ హెచ్.డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ప్లస్ 90 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్.. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్
ర్యామ్.. 4జీబీ, 6 జీబీ
స్టోరోజ్.. 125 జీబీ (మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది)
బ్యాటరీ... 6000ఎం ఏహెచ్ బ్యాటరీ
ఓఎస్... వన్ యూఐ 6 బేస్డ్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ 
మార్కెట్‌లో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 4జీబీ ధర రూ.12,999గా నిర్ణయించారు. రెండో రకమైన ఎఫ్15 5జీ 6 జీబీ ధర రూ.14,999గా ధరను నిర్ణయించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు