దేశంలోని టెలికాం కంపెనీలకు యూఐడీఏఐ ఓ గడువు విధించింది. మొబైల్ వినియోగదారుల ఐడెంటిటీ కోసం తీసుకున్న ఆధార్ కార్డులను డీ లింక్ చేయాలని ఆదేశించింది. అలాగే, ఇకపై వినియోగదారుడి గుర్తింపు కోసం ఆధార్ గుర్తింపు కార్డును సేకరించరాదని స్పష్టంచేసింది.
నిన్నామొన్నటివరకు కొన్ని కంపెనీలు ఐడెంటీ కోసం ఆధార్‌ను కస్టమర్ల నుంచి సేకరించేవి. అయితే ఆ ప్రక్రియను ఆపేయాలని భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా సంస్థలకు సోమవారం యూఐడీఏఐ ఆదేశాలు జారీచేసింది.